నల్లద్రాక్ష తినడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. వీటిని తీసుకోవడం వల్ల క్యాన్సర్, గుండె జబ్బులు లాంటి సమస్యల ముప్పును తగ్గించుకోవచ్చని అంటున్నారు. ఇందులో రెస్వరట్రాల్, ఫ్లేవనాయిడ్స్, ఆంథోసయనిన్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి రక్తం గడ్డకట్టడాన్ని నెమ్మదింప చేస్తాయని అంటున్నారు.