రోజువారీ వంటలో ఉపయోగించే తెల్ల ఉప్పుకు బదులు నల్ల ఉప్పు వాడితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ఆయుర్వేద నిపుణుల ప్రకారం, నల్ల ఉప్పు హైబీపీ, అజీర్తి, మలబద్ధకం, గుండెల్లో మంట వంటి సమస్యలకు అద్భుత ఔషధంగా పనిచేస్తుంది. ఇందులో తక్కువ సోడియం ఉండడం వల్ల హైబీపీ ఉన్నవారికి ఇది సురక్షిత ఎంపిక. అలాగే ఐరన్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటి విలువైన ఖనిజాలకు నిలయం. నల్ల ఉప్పు కండరాల పనితీరును మెరుగుపరుస్తుంది.