TG: హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకున్నది. గోదావరి హస్టల్ రాత్రి భోజనంలో లేజర్ బ్లేడులు రావడం విద్యార్ధులను ఆందోళనకు దిగారు. ఇటీవల కాలంలోనే వరుసగా అన్నంలో పురుగులు రావడం, బ్లేడులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతా జరుగుతున్నా ఉన్నతాధికారులు స్పందించడం లేదని నిరసనకు దిగారు. వెంటనే వీసీ, చీఫ్ వార్డెన్ స్పందించాలని విద్యార్ధులు రాత్రి రోడ్డెక్కారు.