TG: ఫార్ములా-ఈ కారు రేస్ కేసులో HMDA మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిని ఇవాళ ఏసీబీ విచారించనుంది. హెచ్ఎండీఏ నిధులను ఎఫ్ఈవో కంపెనీకి బదిలీ చేయడంపై BLN రెడ్డి నుంచి వివరాలు ఏసీబీ ఆరా తీయనుంది. ఇదే కేసులో మనీలాండరింగ్, ఫెమా నిబంధనల ఉల్లంఘన అభియోగాల నేపథ్యంలో ఆయనను ఈడీ అధికారులు బుధవారం ఎనిమిదిన్నర గంటలపాటు విచారించారు.