లారెన్స్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన హారర్ కామెడీ చిత్రాల్లో ‘కాంచన’ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. మూడు భాగాలుగా వచ్చిన ఈ హారర్ కామెడీ మూవీ లారెన్స్‌కు మంచి గుర్తింపు తెచ్చింది. అయితే ఇప్పుడు కాంచన-4 సైతం రెడీ అవుతుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో స్టార్ట్ అయింది. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహీ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల షూటింగ్‌లో కూడా పాల్గొన్నట్లు సమాచారం.