ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ నివాసం, ప్రెసిడెంట్ మసూద్ పెజెష్కియాన్ కార్యాలయం వద్ద బాంబు పేలుళ్లు జరిగాయని వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనలకు సంబంధించిన వీడియోలను ఇరానియన్ మీడియా విడుదల చేసింది. ఇప్పటికే ఇరాన్ సైనికులను లక్ష్యంగా చేసిందన్న ఇజ్రాయెల్.. ఇప్పుడు రాజకీయ నాయకులపై దాడులకు తెగబడిందన్న కథనాలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. దాడుల గురించి పూర్తి సమాచారం ఇంకా వెల్లడికాలేదు.