దేశ రాజధాని ఢిల్లీలో బాంబు పేలుడు కలకలం రేపింది. ప్రశాంత్ విహార్ ప్రాంతంలోని పీవీఆర్ మల్టిప్లెక్స్ సమీపంలో గురువారం ఉదయం భారీ పేలుడు శబ్దం వినిపించింది. దీంతో స్థానికులు భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బందితో ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.