నైజీరియా దేశంలో ఘోర ప్రమాదం జరిగింది. ఇస్లామిక్ తీవ్రవాదులు రోడ్డు పక్కన అమర్చిన బాంబు పేలడంతో బస్సులో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది చనిపోయారు. అనేక మంది గాయపడ్డారు. బోకోహరం గ్రూప్‌నకు చెందిన ఇస్లామిక్ తీవ్రవాదులు పాశ్యాత్య విద్యను వ్యతిరేకించడంతో పాటు ఇస్లామిక్ చట్టాన్ని అమలు చేయాలని ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఓ హైవేపై అమర్చిన బాంబు పేలగా ఈ ఘటన జరిగింది.