శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు మరోసారి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. అప్రమత్తమైన ఎయిర్‌పోర్ట్ భద్రతా సిబ్బంది విమానాశ్రయంలో ముమ్మర తనిఖీలు చేపట్టారు. చివరికి ఇది ఫేక్ మెయిల్‌గా తేలడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే, ఈ బెదిరింపు మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, దాని వెనక ఎవరు ఉన్నారు అనే కోణంలో అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.