ఎయిర్‌ ఇండియా విమానానికి బాంబు బెదిరింపులు

78చూసినవారు
ఎయిర్‌ ఇండియా విమానానికి బాంబు బెదిరింపులు
దేశంలో గత కొన్ని రోజులుగా బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. తాజాగా ఎయిర్‌ ఇండియా విమానానికి కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. బుధవారం రాత్రి 7:30 గంటల సమయంలో ఎయిర్‌ ఇండియాకు చెందిన విమానం ఢిల్లీ నుంచి వడోదర వెళ్లేందుకు రన్‌వేపై సిద్ధంగా ఉంది. ఆ సమయంలో ఓ టిష్యూ పేపర్‌పై ‘బాంబు’ అని రాసి ఉన్న నోట్‌‌ను విమానంలోని లావేటరీలో సిబ్బంది గుర్తించారు. వెంటనే తనిఖీలు చేపట్టగా ఎలాంటి పేలుడు పదార్థాలు కనిపించలేదు.

సంబంధిత పోస్ట్