బొల్లారం ఆర్మీ స్కూల్‌కి బాంబు బెదిరింపు

82చూసినవారు
బొల్లారం ఆర్మీ స్కూల్‌కి బాంబు బెదిరింపు
TG: హైదరాబాద్‌లోని బొల్లారంలో ఉన్న ఓ స్కూల్‌కు బుధవారం బాంబు బెదిరింపు సందేశాలు వచ్చినట్లు సిబ్బంది తెలిపింది. దీంతో అప్రమత్తమైన టీచర్లు, స్కూల్ సిబ్బంది వెంటనే విద్యార్థులను ఇంటికి పంపి క్షణ్ణంగా తనిఖీ చేశారు. అయితే స్కూల్‌లో ఎటువంటి బాంబు దొరకలేదు. దీంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఈ మెయిల్ తమిళనాడు నుంచి వచ్చినట్లు ఆర్మీ అధికారులు గుర్తించారు. ఆకతాయిల పనిగా భావిస్తున్నారు.

సంబంధిత పోస్ట్