AP: పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో బుధవారం షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. విష్ణు ఇంజినీరింగ్ కళాశాలకు బాంబు బెదిరింపు వచ్చింది. బాంబు పెట్టినట్లు ఆగంతకుడి నుంచి ఈమెయిల్ రావడంతో కాలేజీలో అందరూ ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, బాంబు స్క్వాడ్ బృందం తనిఖీలు చేపట్టారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.