తెలంగాణ సచివాలయానికి బాంబు బెదిరింపు ఫోన్ కాల్స్ రావడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. దీంతో పోలీసులకు సమాచారం అందించగా... వారు సోదాలు నిర్వహించి ఎక్కడ బాంబు లేదని నిర్ధారించారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే మూడు రోజుల నుంచి గుర్తు తెలియని దుండగుడు ఫోన్ చేసి సచివాలయంలో బాంబు పెట్టినట్టు బెదిరిస్తున్నాడు. తాజాగా ఫోన్ చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఎందుకు ఫోన్ చేశాడనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.