నేరుగా రైతు ఖాతాల్లోకే బోనస్ డబ్బులు: మంత్రి ఉత్తమ్

85చూసినవారు
నేరుగా రైతు ఖాతాల్లోకే బోనస్ డబ్బులు: మంత్రి ఉత్తమ్
తెలంగాణలో వానాకాలం ధాన్యం కొనుగోళ్లపై కేబినెట్ సబ్ కమిటీ తుది నివేదిక సిద్ధమైందని గురువారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం 80 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయించిందన్నారు. ఈ సీజన్ నుంచే సన్న రకం ధాన్యంపై రూ.500 బోనస్ నేరుగా రైతుల అకౌంట్లలోనే జమ అవుతాయని చెప్పారు. ఈ మేరకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కు ఈ కుబేర్ ప్లాట్ ఫామ్ ద్వారా జమ చేసే ఏర్పాట్లు చేశామని తెలిపారు.

సంబంధిత పోస్ట్