బోరుగడ్డ అనిల్‌ కుమార్‌కు 14 రోజుల రిమాండ్‌

63చూసినవారు
బోరుగడ్డ అనిల్‌ కుమార్‌కు 14 రోజుల రిమాండ్‌
AP: మచిలీపట్నం కోర్టు బోరుగడ్డ అనిల్ కుమార్‌కు 14 రోజుల రిమాండ్‌ విధించింది. అనిల్‌ను బుధవారం పీటీ వారెంట్‌పై అదుపులోకి మచిలీపట్నం చిలకలపూడి పోలీసులు తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా, చిలకలపూడి పోలీసులు అనిల్‌ను గురువారం 2వ అదనపు జిల్లా జడ్జి ఎదుట హాజరుపరిచారు. అనిల్‌ కుమార్‌పై 2019లో చిలకలపూడి పీఎస్‌లో రెండు కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసుల్లో వాదనలు విన్న అనంతరం న్యాయమూర్తి అనిల్‌కు మార్చి 27 వరకు రిమాండ్‌ విధించారు.

సంబంధిత పోస్ట్