పానీపూరి కావాలంటూ సైబర్‌ క్రైం పోలీసులకు ఫోన్‌ చేసిన బాలుడు

71చూసినవారు
పానీపూరి కావాలంటూ సైబర్‌ క్రైం పోలీసులకు ఫోన్‌ చేసిన బాలుడు
పుదుచ్చేరి సైబర్‌ క్రైం విభాగంలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఏడేళ్ల బాలుడు 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఎనిమిదు సార్లు కాల్‌ చేసి పానీపూరి, చాక్లెట్లు కొనివ్వాలంటూ అడిగాడు. అధికారులు హెచ్చరించినా మళ్లీ మళ్లీ కాల్‌ చేస్తుండటంతో విసిగిపోయిన పోలీసులు శుక్రవారం నంబర్‌ ఆధారంగా బాలుడి ఇంటికి వెళ్లి విచారణ చేపట్టారు. తల్లి ఫోన్‌ నుంచి కాల్‌ చేస్తున్నట్లు తెలిసి, తల్లిదండ్రులకు వివరాలు తెలియజేసి బాలుడికి హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్