బావిలో పడి బాలుడి మృతి (వీడియో)

51చూసినవారు
సూర్యాపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అనంతగిరి మండలం శాంతినగర్‌లో బావిలో పడి ఓ బాలుడు మృతి చెందాడు. ఆదివారం సెలవు రోజు కావడంతో హాస్టల్లో పనిచేస్తున్న వీరబాబు అనే వ్యక్తి టేకు చెట్లు తొలగించడానికి బాలుడిని వెంట తీసుకెళ్లాడు. చెట్లు తొలగిస్తున్న సమయంలో బాలుడు కాలు జారీ బావిలో పడిపోవడంతో మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని వెలికి తీయడానికి చర్యలు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్