TG: రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి చెందిన ఘటన నిర్మల్ జిల్లా భైంసా మండలం వానల్ పాడ్ వద్ద ఆదివారం చోటు చేసుకుంది. కుష్టి గ్రామానికి చెందిన రైతు జి.మల్లేష్ వానల్ పాడ్ గ్రామంలో స్థిరపడ్డాడు. 8వ తరగతి చదువుతున్న కుమారుడు అనిల్ స్కూల్‌కు సెలవు కావడంతో ఇంటికి వచ్చాడు. ఇవాళ ఉదయం తండ్రికి తెలియకుండా ద్విచక్ర వాహనం నడిపాడు. వానల్ పాడ్ వద్ద జాతీయ రహదారిపై అదుపుతప్పి కిందపడటంతో అక్కడికక్కడే చనిపోయాడు.