విద్యుత్ షాక్‌తో బాలుడి మృతి

78చూసినవారు
విద్యుత్ షాక్‌తో బాలుడి మృతి
TG: నిజామాబాద్ జిల్లా బాన్సువాడ మండలం, ఇబ్రహీంపేట గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గోవర్థన్ సాయి (12) అనే బాలుడు కరెంట్ షాక్‌తో మృతి చెందాడు. ఇంటి ముందున్న రేకుల షెడ్‌కు సర్వీస్ వైర్ చుట్టి ఉండటంతో గత రెండు మూడు రోజులుగా కురిసిన గాలి వానకు విద్యుత్ ప్రసరించి షాక్ కొట్టింది. తల్లి కాపాడటానికి ప్రయత్నించగా షాక్ తగిలి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అయితే బాలుడి తండ్రి మలేషియాలో కూలి పని చేస్తున్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్