ఇంటిపై హై టెన్షన్ వైర్ తగిలి బాలుడికి తీవ్రగాయాలు (వీడియో)

51చూసినవారు
ఇంటిపై హై టెన్షన్ వైర్ తగిలి బాలుడికి తీవ్రగాయాలు అయ్యాయి. హైదరాబాద్ అంబర్‌పేటలో దీపావళి పండగ సందర్భంగా లైటింగ్ ఏర్పాటు చేస్తుండగా.. ఇంటి పైనుంచి వెళ్తున్న హై టెన్షన్ వైర్ తగిలి అభి(14) అనే బాలుడికి షాక్ కొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన బాలుడిని చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్