బాలుడిని చెట్టుకు కట్టేసి దాడి (వీడియో)

78చూసినవారు
యూపీలోని అమ్రోహాలో శనివారం జరిగిన షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. సైదంగలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో మొబైల్ ఫోన్ దొంగిలించాడనే అనుమానంతో 14 ఏళ్ల బాలుడిని కొందరు దారుణంగా కొట్టారు. చెట్టుకు కట్టేసి చెంపదెబ్బలు కొట్టారు. అంతటితో ఆగకుండా బాలుడిని గదిలోకి తీసుకెళ్లి, సీలింగ్‌ ఫ్యాన్‌కు చేతులు కట్టి వేలాడదీశారు. బాలుడి తండ్రి ఫిర్యాదుతో నలుగురు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్