TG: చాక్లెట్ కొనుక్కుందామని బయటకి వెళ్లిన బాలుడ్ని టిప్పర్ ఢీకొనడంతో మృతి చెందాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం పూల్లయ్యబోడుతండాలో ఇవాళ చోటు చేసుకుంది. వెంకన్న, జ్యోతి దంపతుల కుమారుడు అనిల్ రెండో తరగతి చదువుతున్నాడు. మంగళవారం పాఠశాల నుంచి వచ్చాక చాక్లెట్ కోసం దుకాణానికి వెళ్తుండగా.. టిప్పర్ ఢీకొట్టింది. బాలుడు అక్కడికక్కడే మరణించాడు. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.