భారత్- పాక్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో, రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో మార్బుల్ వ్యాపారులు టర్కీ నుంచి మార్బుల్, గ్రానైట్ దిగుమతులను బాయ్‌కాట్ చేస్తున్నట్టు ప్రకటించారు. పాకిస్థాన్ భారత్‌పై ఇటీవల జరిపిన దాడుల్లో ఉపయోగించిన డ్రోన్లు టర్కీ నుంచి ఉత్పత్తి కావడంతో, ఉదయపూర్ మార్బుల్ ప్రాసెసర్స్ కమిటీ అత్యవసర సమావేశాన్ని నిర్వహించి, టర్కీ మార్బుల్‌ని నిషేధించాలని నిర్ణయించింది.