AP: విశాఖపట్నం కేజీహెచ్‌లో గులియన్ బారీ సిండ్రోమ్(జీబీఎస్) వ్యాధితో చికిత్స పొందుతూ మహిళ మృతి చెందింది. ఎల్. కోట మండలం మలేవీడు గ్రామానికి చెందిన రేణుక మహంతి కేజీహెచ్‌లో వైద్య సేవల కోసం గురువారం ఆసుపత్రిలో చేరారు. సోమవారం ఆమెకు ఛాతీలో నొప్పి రావడంతో చికిత్స ప్రారంభించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా, ఆదివారం గుంటూరులో చికిత్స పొందుతూ ఓ మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే.