హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్ షో కోట్‌లో గ్యాంగ్ రేప్ జరిగింది. బాలికపై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారం జరిపినట్లు అధికారులు తెలిపారు. నార్సింగి పోలీస్ స్టేషన్‌లో బాలిక తల్లిదండ్రులు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై ఫోక్స్ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు వారు తెలిపారు.