BREAKING: రేపు స్కూళ్లకు సెలవు.. ఎక్కడంటే?

TG: సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం పెద్దగట్టు శ్రీ లింగమంతుల స్వామి జాతర నేపథ్యంలో నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో పాఠశాలలు, విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. సూర్యాపేట జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలు, నల్గొండ జిల్లాలోని పాఠశాలలకు సంబంధిత కలెక్టర్లు సెలవు ప్రకటించారు. మేడారం తర్వాత అతిపెద్ద జాతరగా పిలువబడే ఈ పెదగట్టు జాతరకు వివిధ రాష్ట్రాల నుండి 25 లక్షలకు పైగా భక్తులు హాజరవుతార అంచనా.