మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డిపో సెక్యూరిటీ సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించారు. అయ్యప్ప మాలధారణలో ఉన్న డ్రైవర్‌కు బ్రీత్ ఎనలైజర్ పరీక్ష నిర్వహించిన ఘటన వెలుగుచూసింది. మాల ధరించిన వారికి పరీక్షలు ఏంటని ప్రశ్నించినవారిపై డిపో మేనేజర్ దురుసుగా ప్రవర్తించారని అయ్యప్ప భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులపై డిపో మేనేజర్ దురుసుగా ప్రవర్తించడంతో భక్తులు డిపో ముట్టడికి పిలుపునిచ్చారు.