మహారాష్ట్రాలోని మూర్తిజాపూర్‌కు చెందిన నూతన వరుడికి అనుకోని షాక్ తగిలింది.పెద్దలందరూ పెళ్లి నిశ్చయం చేసి, తేదీ సైతం ఫిక్స్ చేశాకా వధువు మేనమామ షాక్ ఇచ్చాడు. పెళ్లికి కొన్ని రోజుల ముందు వరుడి సిబిల్ స్కోర్‌ను చెక్ చేయగా… అతడు అనేక బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నట్లు గుర్తించారు. దీంతో మేనమామ పెళ్లి క్యాన్సిల్ చేశాడు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న యువకుడు తమ బిడ్డను ఎలా సంతోషంగా చూసుకుంటాడని.. అందుకే రద్దు చేస్తున్నట్లు వారు తెలిపినట్లు సమాచారం.