అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదం ఎంతో మంది కుటుంబాల్లో తీవ్ర విషాదం నిలిపింది. దాదాపు ఈ ప్రమాదంలో 242 మంది మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం. అయితే ఈ ప్రమాదంలో నవ వధువు కూడా మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కొద్ది రోజుల ముందు పెళ్లి కాగా.. భర్తను కలవడానికి లండన్ వెళ్తున్న నవ వధువు ఈ ప్రమాదంలో మృతి చెందిందన్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.