బ్రిటన్‌కు చెందిన అధునాతన F-35B ఫైటర్ జెట్ ఇంధనం తగ్గిపోవడంతో శనివారం అర్ధరాత్రి కేరళలోని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేసింది. ఇది బ్రిటన్‌కు చెందిన HMS ప్రిన్స్ ఆఫ్ వెల్స్ కేరియర్ స్ట్రైక్ గ్రూప్‌లో భాగంగా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సేవలు అందిస్తోంది. ఇటీవలభారత్-బ్రిటన్ మధ్య సంయుక్త మిలిటరీ విన్యాసాల్లో పాల్గొంది. వాతావరణ పరిస్థితులు అడ్డొచ్చినట్టు ప్రాథమిక సమాచారం.