భగవద్గీతపై ప్రమాణం చేసిన బ్రిటన్ ఎంపి

53చూసినవారు
భగవద్గీతపై ప్రమాణం చేసిన బ్రిటన్ ఎంపి
భారతీయ మూలాలుగల శివానీ రాజా (29) బ్రిటన్‌ పార్లమెంటులో భగవద్గీతపై ప్రమాణం చేసి ఎంపీగా బాధ్యతలు చేపట్టారు. ఆమె ఇటీవల జరిగిన ఎన్నికల్లో లెస్టర్‌ ఈస్ట్‌ నియోజకవర్గం నుంచి ఎంపీగా విజయం సాధించారు. "భగవద్గీత సాక్షిగా బ్రిటన్ రాజు విశ్వసనీయురాలిగా ఉంటానంటూ ప్రమాణంచేయడం నా జీవితంలో మరిచిపోలేని రోజు” అని ఆమె ట్వీట్ చేశారు. కన్జర్వేటివ్‌ పార్టీ అభ్యర్థిని అయిన ఆమె లేబర్‌ పార్టీ అభ్యర్థి రాజేశ్‌ అగర్వాల్‌పై గెలుపొందారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్