బ్రిటిష్ సింగర్ ఎడ్ షీరన్ గాయని శిల్పరావుతో కలిసి ఓ కన్సర్ట్‌లో వేదికను పంచుకున్నారు. ఈ సందర్భంగా వారు దేవర సినిమాలోని ‘చుట్టమల్లే’ పాటను పాడి ఫ్యాన్స్‌ను ఖుషి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. దీంతో ఈ సాంగ్ క్రేజ్ ఇప్పట్లో తగ్గేలా లేదని, ప్రతి రోజూ దీనికి సంబంధించి ఏదో ఒక వీడియో వైరలవుతోందని ఎన్టీఆర్, అనిరుధ్ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.