తమ్మడు చేసిన పనికి అక్క ఆత్మహత్య ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. చామరాజనగర జిల్లా కాడుగోళ్లలో నివసిస్తున్న సుశీల అనే మహిళ ఇంటికి వచ్చిన తన తమ్ముడు, భర్త దాచుకున్న నగదు, ఫోన్ దొంగలించి పారిపోయాడు. సుశీల భర్త బావమరిదికి ఫోన్ చేసి ఇంటికి వచ్చి ఇలాంటి పనులు చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. సుశీలపై సైతం మండిపడ్డారు. దీంతో అవమానం తట్టుకోలేక ఇద్దరు పిల్లలతో కలిసి సుశీల ఆత్మహత్య చేసుకుంది.