కంచ గచ్చిబౌలి విషయంలో BRS, BJP కుట్ర చేస్తున్నాయి: శ్రీధర్ బాబు

70చూసినవారు
కంచ గచ్చిబౌలి విషయంలో BRS, BJP కుట్ర చేస్తున్నాయి: శ్రీధర్ బాబు
TG: BRS, BJP పార్టీలపై మంత్రి శ్రీధర్ బాబు అసహనం వ్యాఖ్యలు చేశారు. రెండు పార్టీలు కలిసి కంచ గచ్చిబౌలి విషయంలో కుట్రలు చేస్తున్నట్లు ఆరోపించారు. రాష్ట్ర బీజేపీ నేతలు తప్పుడు సమాచారం ఇవ్వడంతోనే మోదీ కూడా ఈ విషయం గురించి మాట్లాడారన్నారు. ఇటీవల సుప్రీంకోర్టే అవి ప్రభుత్వ భూములని ప్రకటించినట్లు గుర్తుచేశారు. కానీ ప్రస్తుతం సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలను కూడా తప్పకుండా పాటిస్తామన్నారు. ఇక స్మిత సబర్వాల్ AI పోస్ట్ పై కూడా విచారణ చేపడతామని చెప్పారు.

సంబంధిత పోస్ట్