TG: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒక్కటే అని ఆయన ఆరోపించారు. కిషన్ రెడ్డికి.. బీఆర్ఎస్‌కు రహస్య ఒప్పందాలు ఉన్నాయని విమర్శలు చేశారు. . తెలంగాణకు పెట్టుబడులు రావటంతో ఓర్వలేక సీఎం రేవంత్‌పై కిషన్ రెడ్డి విమర్శలు చేస్తున్నారని అన్నారు. చేతనైతే ప్రధానితో కొట్లాడి తెలంగాణకి నిధులు తీసుకురావాలని కిషన్ రెడ్డికి అడ్లూరి సవాల్ విసిరారు.