TG: బీఆర్ఎస్ అవాస్తవాలతో ప్రతి విషయాన్ని రాజకీయం చేసేందుకు యత్నిస్తోందని మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. కేటీఆర్ చేసిన ఆరోపణలపై స్పందిస్తూ.. కంచ గచ్చిబౌలి భూములు ప్రభుత్వానివేనన్నారు. వాటి విలువ రూ.20,653 కోట్లుగా లెక్కగట్టామన్నారు. TGIIC ద్వారా బాండ్లు జారీ చేసి రూ.10వేల కోట్లను సమీకరించామని, తనఖా పెట్టలేదన్నారు. ఈ భూముల విషయంలో ప్రభుత్వంపై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తిచేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.