TG: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. 2023 ఎన్నికల సమయంలో కమలాపురం PSలో నమోదైన కేసును కొట్టివేసేందుకు కోర్టు నిరాకరించింది. విచారణ ఎదుర్కోవాల్సిందేనని ఆదేశించింది. 2023లో ఎన్నికల ప్రచారంలో తనను గెలిపించకుంటే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటానని కౌశిక్ వ్యాఖ్యానించారు. దీనిపై నోడల్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు.