TG: కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ పేరు అనేది తుడిస్తే పోయేది కాదు.. యావత్ తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిపోయిన పేరు కేసీఆర్ అంటూ గుర్తు చేశారు. కాంగ్రెస్ సభలు జరిగేటప్పుడు ఏ ఒక్కరోజైనా కేసీఆర్ పేరు ఎత్తకుండా ఉన్నారా? అని ప్రశ్నించారు.