HYDలోని భారీ అంబేద్కర్ విగ్రహం వద్ద BRS ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. అసెంబ్లీ నుంచి జగదీష్ రెడ్డిని అక్రమంగా సస్పెండ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకుముందు అసెంబ్లీలోని BRSLP రూమ్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అసెంబ్లీ ప్రాంగణం నుంచి వెళ్లిపోవాలని జగదీష్ రెడ్డికి మార్షల్స్ చెప్పారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన హరీశ్, KTR, తలసాని మార్షల్స్‌తో వాగ్వాదానికి దిగారు. జగదీష్ రెడ్డి బయటకు వెళ్లాల్సిందే అని మార్షల్స్ పంపిచేశారు.