బీఆర్‌ఎస్‌కు ఇంకా అహంకారం తగ్గలేదు: మంత్రి సీతక్క

63చూసినవారు
బీఆర్‌ఎస్‌కు ఇంకా అహంకారం తగ్గలేదు: మంత్రి సీతక్క
తెలంగాణలో అధికారం కోల్పోయినా బీఆర్‌ఎస్‌కు ఇంకా అహంకారం తగ్గలేదని మంత్రి సీతక్క విమర్శించారు. దళిత స్పీకర్‌పై బీఆర్‌ఎస్‌కు గౌరవం లేదని ఆమె ఆరోపించారు. స్పీకర్‌ను నువ్వు అంటూ సంబోధిస్తున్నారని మండిపడ్డారు. దళిత స్పీకర్‌ కాబట్టే ఏకవచనంతో పిలుస్తున్నారని, బీఆర్‌ఎస్‌ నేతలకు మహిళా గవర్నర్‌ అంటే కూడా గౌరవంలేదని పేర్కొన్నారు. ఆదివాసీ రాష్ట్రపతిపై కూడా గౌరవం లేదు మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్