అమెరికాలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, BRS సిల్వర్ జూబ్లీ వేడుకల సన్నాహక సమావేశాలు ఘనంగా నిర్వహించనున్నారు. జూన్ 1న డల్లాస్‌లో జరగనున్న వేడుకల్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పాల్గొనన్నారు. రానున్న 10 రోజుల పాటు మరిన్ని నగరాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నారు. ఎన్నారైలు, పార్టీ కార్యకర్తలలో సమావేశాలు BRSకు ఉత్సాహం నింపుతున్నాయి. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున ఎన్నారైలు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.