తెలంగాణలో ఆడవారిపై అరాచకాలు, మోసాలు జరుగుతున్నాయని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి BRS మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, సునీతా, MLA కోవా లక్ష్మి లేఖ రాశారు. 'మిస్ వరల్డ్ పోటీలు' సందర్భంగా విదేశీ మహిళలకు కాళ్లు కడిగించిన ఘటన తీవ్రమైన వివాదానికి దారితీస్తోందని పేర్కొన్నారు. రాష్ట్ర మహిళలకు CM రేవంత్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే కాంగ్రెస్ పార్టీపై మహిళలు తిరగబడే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.