ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు నేపథ్యంలో రాహుల్ గాంధీకి అభినందనలు చెప్పి ఎద్దేవా చేసిన కేటీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఫైర్ అయ్యారు. ఎంపీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించడం కోసం సొంత పార్టీకి సున్నా సీట్లు అందించిన గొప్ప నాయకత్వం ఆయనదని సెటైర్ వేశారు. తెలంగాణలో బీజేపీ బలోపేతం కావడానికి బీఆర్ఎస్సే కారణమని మంత్రి ఆరోపించారు. కాగా బీజేపీని గెలిపించిన రాహుల్ గాంధీకి కాంగ్రాట్స్ అంటూ కేటీఆర్ ఆయన నాయకత్వంపై విమర్శలు గుప్పించారు.