AP: తిరుపతి జిల్లాలో ఓ మహిళ హత్య కలకలం రేపుతోంది. తిరుపతి కోలా వీధిలో టి.ప్రమీలమ్మ (60) అనే మహిళ దారుణ హత్యకు గురైంది. ప్రమీలమ్మ చిన్న కూతురు రోజా భర్త రవి నాయక్ అత్త దగ్గర ఉన్న నగదు కోసం హత్య చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంఘటన స్థలానికి డీఎస్పీ శ్రీలత ,వెస్ట్ సీఐ మురళీ మోహన్ రావు చేరుకుని విచారణ చేస్తున్నారు. నిందితుడు రవి నాయక్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.