రియల్టర్ దారుణ హత్య.. వెలుగులోకి సంచలన విషయాలు

55చూసినవారు
రియల్టర్ దారుణ హత్య.. వెలుగులోకి సంచలన విషయాలు
షాద్‌నగర్‌ పరిధి గండిపేట మండలం హైదర్షాకోట్‌కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కమ్మరి కృష్ణ (55) దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తన దగ్గర పనిచేసే బాబా అనే వ్యక్తే గొంతు కోసి చంపాడు. అయితే తన బాడీగార్డ్ (బాబా)ను గతంలో పని నుంచి కృష్ణ తొలిగించగా.. ఇటీవల బతిమిలాడి పనిలో చేరాడు. బుధవారం 3వ భార్యతో కలిసి కృష్ణ ఫామ్ హౌస్‌కు వచ్చారు. ఇది తెలుసుకుని మరో ఇద్దరితో కలిసి చంపేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్