TG: ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 6వ తరగతి చదువుతున్న బాలిక పై 27 ఏళ్ల భూక్యా హరి అనే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ నెల 13వ తేదీ రాత్రి 7 గంటల సమయంలో బాలిక కిరాణా షాపునకు వెళ్లగా హరి వెంబడించాడు. తర్వాత తన మోటర్ సైకిల్ పై బలవంతంగా ఎక్కించుకొని గ్రామ సమీపంలోని చేనులోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. బాలిక కేకలు వేయటంతో నిందితుడు పరారయ్యాడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందగా కేసు నమోదు చేశారు.