AP: శ్రీకాకుళం జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళా డిగ్రీ కాలేజీ హాస్టల్‌లో గుర్తుతెలియని దుండగులు గురువారం రాత్రి ప్రవేశించారు. బీఎస్సీ ఫైనలియర్ చదువుతోన్న విద్యార్థినిపై హాస్టల్ ప్రాంగణంలోనే దారుణానికి ఒడిగట్టారు. హాస్టల్‌లో అందరూ ఉండగానే విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. తీవ్రంగా గాయపడిన విద్యార్థినీని తోటి విద్యార్థినులు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.