దారుణం.. కత్తితో నరికి చంపేశారు (వీడియో)

74చూసినవారు
AP: రాష్ట్రంలో దారుణం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణం సత్యనారాయణపురం ప్రాంతానికి చెందిన యర్రంశెట్టి ఆంజనేయులు హత్యకు గురయ్యాడు. ఆయనను కత్తితో నరికి చంపేశారు. గత కొంతకాలంగా సాయినగర్‌లో శేషుకుమారి అనే వివాహితతో ఆంజనేయులు కలిసి ఉంటున్నాడు. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. శేషుకుమారి కొడుకు నరేష్ ఈ హత్య చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. దర్యాప్తు జరుగుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్