తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామం నుంచి మండల కేంద్రాలకు ఖచ్చితంగా బీటీ రోడ్లు ఉండాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రీజనల్ రింగ్ రోడ్డు, ఆర్అండ్బీ, నేషనల్ హైవే ప్రాజెక్టులపై అధికారులతో శుక్రవారం సీఎం సమీక్ష నిర్వహించారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా వీలైనంత వెడల్పు ఉండే విధంగా రోడ్లను డిజైన్ చేయాలన్నారు. ఇందుకు సంబంధించి విడతల వారీగా నిధులు విడుదల చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.