బెట్టింగ్‌ భూతానికి బీటెక్ విద్యార్థి బలి

77చూసినవారు
బెట్టింగ్‌ భూతానికి బీటెక్ విద్యార్థి బలి
బెట్టింగ్‌ భూతానికి బీటెక్ విద్యార్థి బలయ్యాడు. నల్గొండలోని రవీంద్రనగర్‌కు చెందిన కొండూరు శ్రీనివాస్, నాగలక్ష్మి దంపతులకు నితిన్‌(21), ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. బీటెక్‌ థర్డ్‌ ఇయర్‌ చదువుతున్న నితిన్‌ స్నేహితులతో కలిసి గది అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. కాలేజీ ఫీజు కోసం తల్లిదండ్రులు రూ.1.03 లక్షలు ఇచ్చారు. ఆ డబ్బులు బెట్టింగ్‌లో పోగొట్టాడు. తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురై గూడ్స్‌ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్